14 July, 2026 | 11:45 PM

లండన్‌లో కత్తి దాడి

01-05-2024 12:05 AM

లండన్, ఏప్రిల్ 30: బ్రిటన్ రాజధాని లండన్‌లో కత్తి దాడి కలకలం సృష్టించింది. తూర్పు లండన్‌లోని హైనాల్ట్‌లో 36 ఏళ్ల వ్యక్తి చేసిన దాడిలో 13 ఏళ్ల బాలుడు మరణించగా, నలుగురు గాయపడ్డారు. నిందితుడు కత్తి పట్టుకుని తిరుగున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ కాగా, ఆ దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం వాహనంతో పాటు ఓ ఇంట్లోకి దూసుకొచ్చిన వ్యక్తి కత్తితో దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలైనట్లు వెల్లడించా రు. ఈ ఘటనలో ఉగ్రకోణం ఉండకపోవచ్చని, విచారణ జరుగుతోందని పోలీ సులు చెప్పారు. ఈ దాడికి సంబంధిం చి ఎలాంటి ఊహాగానాలు వ్యాప్తి చే యొద్దని, దాడి దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని బ్రిటన్ హోం మంత్రి జేమ్స్ క్లెవర్లీ విజ్ఞప్తి చేశారు.