దేశ ప్రజలే నా వారసులు
నాకెలాంటి వారసత్వ సంపద లేదు
బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ
వారణాసిలో యోగి ప్రభుత్వానికి మోదీ ప్రశంసలు
మహిళల భద్రతకు పెద్ద పీట వేశారని కితాబు
ఎస్పీ, కాంగ్రెస్‌పై మోదీ విమర్శల పర్వం
న్యూఢిల్లీ, మే 21: తనకు వారసులెవరూ లేరని, దేశ ప్రజలే తనకు వారసులని ప్రధా ని నరేంద్ర మోదీ అన్నారు. తనకు వారసత్వ సంపద లేదని పేర్కొన్నారు. అందుకే దేశ ప్రజల బంగారు భవిష్యత్తు కోసం తాను ఎంతో కష్టపడుతున్నానని, ఇంకా కష్టపడాల్సిన అవసంర ఉందని చెప్పారు. మంగళవారం బీహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం సభలో మోదీ మాట్లాడారు. ‘మీరు మీ జీవితాంతం ఎదుర్కొన్న కష్టాలు మీ ముందు తరాలు ఎదుర్కోవడం నాకిష్టం లేదు’ అని ప్రధాని అన్నారు.
ఎస్పీ, కాంగ్రెస్‌పై మోదీ విమర్శలు
కాగా, వారణాసిలో జరిగిన వుమెన్స్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఎస్పీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హ యాంలో మహిళలను నిర్లక్ష్యం చేశారని మోదీ దుయ్యబట్టారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్ద పీట వేసిందని కొనియాడారు. పదేళ్ల కింద అత్యాచారానికి ఉరిశిక్ష వేయాలన్న ప్రతిపాదనలను ములా యం సింగ్ వ్యతిరేకించారని, అబ్బాయిలు తప్పులు చేయ డం సహజమని చేసిన వ్యాఖ్యలను మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో అబ్బా యిలు అలాంటి తప్పులు చేయడానికి కూడా ధైర్యం చేయలేరని పేర్కొన్నారు.
వాళ్లకు ఓటు బ్యాంకే ముఖ్యం
కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు అభివృద్ధికి వ్యతిరేకమని, వారికి ఓటు బ్యాంకు ముఖ్యమని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ‘ఎస్పీ హ యాంలో కుంభమేళా సమ యంలో ఏం జరిగేది? తొక్కిసలాట జరిగేది. ప్రజలు చనిపోయేవారు. కుంభమేళా నిర్వహణ కన్నా వారికి ఓటు బ్యాంకు ముఖ్యం’ అని మండిపడ్డారు. ‘భారత డిజిటల్ సాంకేతిక కోసం పెద్ద దేశాలు కూడా అడుగుతున్నాయి. భారత్‌లో జీ సదస్సు నిర్వహించినప్పుడు ప్రపంచం మొత్తం షాకైంది’ అని మోదీ అన్నారు. ప్రపం చదేశాలు భారత్‌ను పొగుడుతుంటే ఇండియా కూటమికి మింగుడుపడట్లేదని వ్యాఖ్యానించారు. అందుకే కాంగ్రెస్ రాకుమారుడు విదేశాలకు వెళ్లి భారత్‌ను తిడుతున్నా రంటూ రాహుల్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు.






