సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడుగా కొండ రాంప్రసాద్
26-04-2026 11:36 AM
బెజ్జూర్: మండల కేంద్రం లోని రైతు వేదికలో సర్పంచ్ ల సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశంలో సర్పంచుల కార్యవర్గం ఎన్నిక జరిగింది. కోరం సభ్యులు అందరూ కలిసి మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షునిగా కొండ రాంప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారిని సాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యక్షులుగా తొర్రెం చిరంజీవి, మన్నెంపల్లి మల్లేష్ లను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా సోయం చిన్నన్న, కార్యదర్శులుగా సెండే పద్మ, పెగడపల్లి సరిత,కుమ్మరి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ శ్రీహరి, కోశాధికారిగా ధరావత్ కవిత, లను ఎన్నుకున్నారు.






