ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా సంతోష్
మంచిర్యాల,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలానికి చెందిన నౌండ్ల సంతోష్ చారి నియామకమయ్యారు. ఆదివారం సంఘ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశ్విని కుమార్ ఈ మేరకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1968లో స్థాపించిన ఈ సంఘం 58 సంవత్సరాలుగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సమాజ అభివృద్ధి కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును పొందిందన్నారు.
గత అధ్యక్షుడి పదవీకాలం ముగిసిన నేపథ్యంలో రాంచి నుంచి వచ్చిన సంఘం జాతీయ నాయకుల బృందం అన్ని రంగాల్లో చురుకుగా ఉన్న సంతోష్ చారిని కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేసి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. తెలంగాణలో సంతోష్ చారి నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెందాలని, సమాజానికి మరింత సేవలు అందించాలని ఆకాక్షించారు.






