16 March, 2026 | 5:56 PM

రాష్ట్రం అప్పుల్లో ఉంది..పైసలు లేక ప్రాజెక్టులు ముందుకు పోతలే

16-03-2026 03:15 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Session) సోమవారం ప్రారంభమయ్యాయి. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్  ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు అభ్యతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kunamneni Sambasiva Rao) మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉన్న అంసతృప్తిని ప్రభుత్వం పరిష్కరించాలని కూనంనేని డిమాండ్ చేశారు. డబ్బుల్లేక ప్రాజెక్టుల పనులు ముందుకు సాగడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాలు కనీసం 25 రోజుల నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.