4 August, 2026 | 1:53 AM

రంగంలో పాల్గొన్న కోట నీలిమ

04-08-2026 12:18 AM

సికింద్రాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో నిర్వహించిన రంగం (భవిష్య వాణి) కార్యక్రమం సందర్భంగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. ఉదయాన్నే ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం అధికారులతో మాట్లాడి కార్యక్రమాల నిర్వహణ, భక్తులకు కల్పించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయానికి చేరుకోగా ఘన స్వాగతం పలికారు. తర్వాత మంత్రి పొన్నం, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, కలెక్టర్ ప్రియాంక అల, దేవాదాయ కమిషనర్ హనుమంత రావు, మాతంగి స్వర్ణలతతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సుభిక్షం కలగాలని అమ్మవారిని ప్రార్థించారు.