18-09-2025 05:51:28 PM
ఉప్పల్ (విజయక్రాంతి): నాచారం పోలీస్ స్టేషన్(Nacharam Police Station) నూతన ఇన్స్పెక్టర్ గా కొత్తపెళ్లి ధనుంజయని నియమిస్తున్నట్లు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. నాచారం సీఐగా ఉన్న రుత్విక్ కుమార్ ను కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు ఇన్స్పెక్టర్ గా బదిలీ చేశారు. గురువారం పొద్దున ధనంజయ్ ఇన్స్పెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ధనుంజయ్ 2002 బ్యాచ్ చెందిన ఇన్స్పెక్టర్ సంస్థానం నారాయణపేట జిల్లా కాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నగరంలో ఇంటెలిజెన్స్ లో పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు అరికట్టేందుకు కృషి చేస్తానని ప్రజలందరూ సహకరించాలని కోరారు.