18-09-2025 05:48:52 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని గడి కోట, గ్రామ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దోమకొండ మండల స్థాయిలో నిర్వహించినటువంటి క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన పాఠశాలల క్రీడాకారులకు గురువారం దోమకొండ గడికోట నందు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా ASP చైతన్య రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, సిఐ సంపత్, దోమకొండ మండల అధికారి ప్రవీణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి తీగలు తిరుమల గౌడ్, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఎస్పీ చైతన్య రెడ్డి, స్ఫూర్తిదాయకమైన ప్రసంగంతో విద్యార్థులను చైతన్య పరుస్తూ క్రీడలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి, జీవితంలో క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయి, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి, ఒత్తిడిని తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలు క్రీడల వల్ల ఉన్నాయని తెలియజేశారు. క్రీడాకారులకు బహుమతులను అతిధుల చేతుల మీదుగా బహుకరించడమైనది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బాబ్జి మాట్లాడుతూ మండల స్థాయి నుండి జిల్లా స్థాయిలో క్రీడలను నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్టు ప్రతినిధులు ఎన్ గణేష్ యాదవ్, కళ్యాణపు కనక శీను హరీష్ రామకృష్ణ వినయ్, వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు.