18-09-2025 05:58:23 PM
పిసిసి ప్రధాన కార్యదర్శి, గజ్జెల కాంతం
కరీంనగర్ (విజయక్రాంతి): స్వయాన కేసీఆర్ కూతురు కవిత నాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ద్వారా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, దోచుకున్నది వాస్తవమే అని చెపుతున్నదని, మరోపక్క కేసీఆర్, కేటీఆర్ లక్ష కోట్లు కాళేశ్వరం సొమ్ము కాజేశారని కమీషన్ ముందు హరీష్ రావు ఒప్పుకున్నారని, ఈ విధంగా ఆ కుటుంబం బయటపెట్టిన విషయాలపై ప్రభుత్వం విచారణ చేస్తుందని, కేసీఆర్ పాలనలో అన్ని శాఖల్లో అవినీతి, దోపిడీ జరిగిందని, కేసీఆర్ కుటుంబం జీవితాంతం జైల్లో చిప్పకూడు తినడం ఖాయమని పిసిసి ప్రధాన కార్యదర్శి, గజ్జెల కాంతం తెలిపారు. గురువారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ హైదరాబాదులో చుట్టూ 30వేల ఎకరాల భూమి, రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఆంధ్ర బడా బాబులకు బినామీల పేరుపై రాసిచ్చారని, ఈ పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఆ పార్టీ నేతలు ఆలోచించుకోవాలన్నారు.
నయీంను కేసీఆర్ ఎన్కౌంటర్ చేయించిన తరువాత అతని దగ్గర ఉన్న 2 వేల ఎకరాల భూమి ఏమైందో, 2 వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయో లెక్క చెప్పలేదని, దీనిపై విచారణ జరిపించాలని మేము ముఖ్యమంత్రిని కోరుతామన్నారు. కేటీఆర్ కు జీవితం కాలమంతా తీహార్ జైలు చిప్ప కూడు తినిపిస్తామని, బిఆర్ఎస్ మూడో సారి అధికారంలోకి వస్తె ఈ రాష్ట్రాన్ని అమ్మేసే వాళ్ళని, ఇంకా ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి వస్తారని కేటీఆర్ అంటున్నారని తెలిపారు. త్వరలోనే కేసీఆర్ కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రజలు తన్ని తరిమేస్తారని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఎర్ర శ్రీనివాస్, క్యాదాషి ప్రభాకర్, సముద్రాల అజయ్, గజ్జెల ఆనందరావు, నీరుకుళ్ళ అనిల్, గడ్డం నాగరాజు, గుంటుకు రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు.