18 August, 2026 | 3:35 AM

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ మరోసారి వాయిదా

18-08-2026 01:04 AM

ఈ నెల 24న నిర్వహిస్తామని సభ్య కార్యదర్శి సతీశ్ కాంబోజ్ ఉత్తర్వులు

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆధ్వర్యంలో జరగాల్సిన త్రిసభ్య కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. సోమవారం జరగాల్సిన సమావేశాన్ని ఈ నెల 24కు వాయిదా వేస్తూ కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్ కాంబోజ్ ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స మావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కావ డం, ఈ సమావేశాల్లో సాగునీటి అంశాలు చర్చ కు వచ్చే అవకాశం ఉండటంతో సమావేశాన్ని వాయిదా వేయాలని ఏపీ నీటిపారుదలశాఖ ఇం జినీర్ ఇన్ చీఫ్ కేఆర్‌ఎంబీని కోరారు. ఏపీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న బోర్డు త్రిసభ్య కమిటీ భేటీని ఈ నెల 24కు రీషెడ్యూల్ చేసింది.

ఉదయం 11 గంటలకు కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి చాంబర్‌లో సమావేశం నిర్వహించనున్నట్టు బోర్డు స్పష్టంచేసింది. సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ, ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సాగునీటి అం శాలపై త్రిసభ్య కమిటీ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికే పలు అంశాలపై స మావేశాలు వాయిదా పడుతున్న నేపథ్యంలో తాజా వాయిదాతో కీలక నిర్ణయాలు మరింత ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది.