17 April, 2026 | 8:58 AM

27న కేఆర్‌ఎంబీ సమావేశం

22-06-2025 12:48 AM

ఉద్యోగుల ఇన్సెంటివ్స్ అంశంలో కోర్టు తీర్పుపై చర్చ

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): ఉద్యోగుల ఇన్సెంటివ్‌ల రద్దుతో పాటు ఇప్పటివరకు ఇచ్చిన ఇన్సెంటివ్‌లను రికవరీ చేయాలనే కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) నిర్ణయంపై బోర్డు ఉద్యో గులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యా యస్థానం బోర్డు నిర్ణయాన్ని వాయి దా వేసింది.

దీనిపై చర్చించేందుకు ఈనెల 27న హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నది. బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపురె ఆ ధ్వర్యంలో జరుగనున్న ఈ సమావేశానికి సభ్యులు హాజరవుతారు. స్థా నికంగా అందుబాటులో లేని సభ్యు లు వర్చువల్ విధానంలో హాజరుకానున్నారు.