తెలంగాణ తల్లికి క్షిరాభిషేకం
తెలంగాణ తల్లి విగ్రహంలోని బతుకమ్మను తొలగించి యావత్ తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీశారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు మార్చాలనుకోవటం మూర్ఖత్వం. .
మేడిపల్లి (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ప్రజలను అవమాన పరిచే విధంగా ఉందని పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహానికి నిరసనగా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట మున్సిపల్ కార్పొరేషన్ల బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి క్షమాపణ చెబుతు క్షిరాభిషేకం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చకపొగ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతిసేల విగ్రహంలో మార్పులు చేశారాని, తెలంగాణ తల్లి విగ్రహం పోరాటంతో నెలకొల్పబడిన రూపమని అది తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్న వారికే ఆ మమకారం తెలుస్తుందని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల వెంటే ఉంటామని పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు మధుసూదన్ రెడ్డి దొంతిరి హరిశంకర్ రెడ్డి, నాయకులు లేతాకుల రఘూపతి రెడ్డి, ఏనుగు మనోరంజన్ రెడ్డి, జావీద్ ఖాన్, ప్రభాకర్ రెడ్డి, మీసాల కృష్ణ, చక్రపాణి గౌడ్, ఉప్పరి విజయ్, యాసారం శ్రీనివాస్, జోగిరెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






