6 May, 2026 | 5:09 PM

భద్రతతోనే బంగారు భవిష్యత్తు

06-05-2026 04:19 PM

నిర్మల్,(విజయక్రాంతి): విద్య శాఖలో విద్యుత్ సరఫరా ఎంత ముఖ్యమో భద్రత కూడా అంతే ముఖ్యమని విద్యుత్ శాఖ డివిజన్ అధికారి నాగరాజు అన్నారు. పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ భద్రత వారోత్సవాలను బుధవారం ప్రారంభించారు. విద్యుత్ సరఫరా సమయంలో విద్యుత్ శాఖలో పనిచేసే సిబ్బంది భద్రత చర్యలను కచ్చితంగా పాటించాలని సేఫ్టీ మేనేజ్మెంట్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వినియోగదారులకు విద్యుత్ ప్రమాదాల భద్రతపై పూర్తిగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఏడిఈ శ్రీనివాసరావు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.