తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు
మంథని లో దాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలనలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
పెద్దపల్లి,(విజయ క్రాంతి): అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లను పెద్దపల్లి జిల్లా కలెక్టర్, కోయ శ్రీహర్ష తో కలిసి మంత్రి బుధవారం, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నష్టపోకుండా అవస రమైన చర్యలు చేప ట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని రవాణా చేసేందుకు అవసర మైన లారీలను ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదే శించారు. రైతులెవ్వరు ఆందోళన చెందవద్దని మంత్రి శ్రీధర్ బాబు, భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, మంథని మునిసిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతి నిధులు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






