ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
24-07-2026 05:33 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు మండల కేంద్రం అర్వపల్లిలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, బీఆర్ఎస్ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వల్లపు గంగయ్య,జిల్లా నాయకులు మొరిశెట్టి ఉపేందర్,రామలింగయ్య, యుగేందర్, రామకోటి, ఓర్సు వెంకన్న,నరేష్, లింగరాజు, వెంకన్న, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






