24 July, 2026 | 5:56 PM

చర్లలో కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలు

24-07-2026 05:24 PM

బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు

ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు బ్రెడ్, పండ్ల పంపిణీ

చర్ల,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను చర్ల బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చర్ల బీఆర్ఎస్ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేటీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 100 మంది రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా దొడ్డి తాతారావు మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి, పారిశ్రామిక రంగ విస్తరణ, ఐటీ ప్రగతి యువతకు ఉపాధి కల్పనలో కేటీఆర్ గారు అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్, తోటపల్లి మాధవరావు, దినసరపు భాస్కర్ రెడ్డి, బొజ్జ సాయి, ప్రణయ్, బేతంచర్ల నర్సవేణి, ఉప్పరి గూడెం సర్పంచ్ సోయం నాగలక్ష్మి, ప తదితరులు పాల్గొన్నారు.