స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు
- క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును అవమానించడమే.
- ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి.
- స్పీకర్ నిర్ణయం కేవలం ఒక తీర్పు మాత్రమే కాదు.
- తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్(Danam Nagender), కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడంపై కేటీఆర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. తెలంగాణ స్పీకర్(Telangana Speaker) తీర్పు ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడిగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును అవమానించడమేనని కేటీఆర్ పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అన్నారు.
స్పీకర్ నిర్ణయం కేవలం ఒక తీర్పు మాత్రమే కాదన్న కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ అన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని సూచించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పిన కేటీఆర్ సరైన సమయంలో సమాధానం చెబుతారని హెచ్చరించారు.




