కావూరి సాంబశివరావు మృతి పట్ల కేటీఆర్ సంతాపం
12-03-2026 03:08 PM
నివాళులర్పించిన బీఆర్‌ఎస్ నేతలు
సత్తుపల్లి,(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (Kalvakuntla Taraka Rama Rao) హైదరాబాద్ లోని మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కావూరి కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మరియు మాగంటి సునీత గోపీనాథ్ వంటి కీలక నేతలు ఉన్నారు




