12 March, 2026 | 9:17 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ

12-03-2026 03:25 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసాను(Rythu Bharosa) రూ. 15 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కానీ రైతు భరోసాను పెంచకుండా రూ. 12 వేలకే పరిమితం చేశారని రామచందర్ రావు ప్రశ్నించారు. ఆ రైతు భరోసాను కూడా సమయానికి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి పంట రైతు భరోసా రాక రైతులు అప్పుల పాలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నీళ్లు కాల్వలకు రాక పంటలు ఎండిపోతున్నారని మండిపడ్డారు.

అప్పులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల(Fee reimbursement dues) వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని రామచందర్ రావు తెలిపారు. పట్టణాలు కుక్కలు, కోతులు, పందుల బెడదతో నిండిపోయిందని ధ్వజమెత్తారు. మురుగునీటి వ్యవస్థలు సరిగ్గాలేక అంటువ్యాధులు ప్రబలుతున్నాయని సూచించారు. ప్రభుత్వ దవాఖానాల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని రామచందర్ రావు ఆరోపించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రజల సమస్యలపై మాట్లాడే బాధ్యతను విస్మరించారని తెలిపారు. తెలంగాణ ప్రజల గొంతుకగా బీజేపీ సమస్యలను మీ దృష్టికి తెస్తోందన్నారు. ఏసీ గదుల నుంచి వచ్చి ప్రజల సమస్యలను పరిస్కరించాలని డిమాండ్ చేశారు.