2 September, 2026 | 2:38 PM

సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటఆర్

02-09-2026 | 12:34pm

హైదరాబాద్: కాంగ్రెస్ వెయ్యి రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తెలంగాణ భవన్‌లో ఛార్జ్ షీట్(Charge sheet) విడుదల చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన కాదు... ఇది పీడన అని, రాష్ట్రంలో దరిద్రం దండయాత్ర మొదలుపెట్టి వెయ్యి రోజులు అయ్యిందని ఎద్దేవా చేశారు. అన్ని రంగాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) విఫలమైందని, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన క్రిమినల్ వేస్ట్ అన కేటీఆర అన్నారు. కాంగ్రెస్ ది రైతులను రాచిరంపాన పెడుతున్న రాక్షస పాలన అని, ఈ శతాబ్ధపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో(Congress Manifesto) అని, వాటిలో 13 డిక్లరేషన్ లు, 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు.   

కాంగ్రెస్ ప్రభుత్వంలో దళతులను దగా చేశారని, పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టి 30 శాతం కమీషన్లు తీసుకొంటున్నారని కేటీఆర్ ఆరోపించారు.  జలద్రోహం చేస్తున్న జలగల పాలన కాంగ్రెస్ ది అని, కాంగ్రెస్ పాలనలో ఎటు చూసినా విధ్వంసం వికృతం. ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఈ సందర్భంగా సవాల్ విసిరారు. ఇక పేజీపై  అక్షర దోషాలు లేకుండా సీఎం రాయగలరా..? అని ప్రశ్నించారు. అక్షర దోషాలు లేకుండా రేవంత్ రెడ్డి రాస్తే... మా పదవులకు రాజీనామా చేస్తామని కేటీఆర్ సవాల్ చేశారు.