కాజీపేటలో పర్యటించిన రామచందర్ రావు
02-09-2026 | 01:31pm
హైదరాబాద్: వరంగల్ జిల్లాలోని కాజీపేట(Kazipet)లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(BJP state president Ramchander Rao) బుధవారం పర్యటించారు. బీఆర్ఎస్ ది ఫ్యామిలీ కంపెనీ, కాంగ్రెస్ ది బ్రదర్స్ కంపెనీ అని విమర్శించారు. కాంగ్రెస్ వెయ్యి రోజు పాలనలో ప్రజలను దగా చేశారని, బీజేపీని చూసి కాంగ్రెస్ పార్టీ(Congress Party) భయపడుతుందని, అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనకు చరమగీతం పాడుతామన్నారు. హైదరాబాద్ పరేడ్ మైదానంలో బీజేపీ నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.






