12 July, 2026 | 3:50 PM

Breaking News

విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •  

డెంగ్యూ మరణాలపై కేటీఆర్ ఆందోళన.. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీకి డిమాండ్

26-08-2024 01:06 PM

సమాచారాన్ని ఎవరు, ఎందుకు దాస్తున్నారు? 

ఆసుపత్రుల్లో ఔషధాలు లేవు

రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాలి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న డెంగ్యూ మరణాలపై ఆందోళన వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన సమస్యను గుర్తించి తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని సోమవారం సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో డెంగీ మరణాలు లేవని ప్రభుత్వం చెబుతోందని కేటీఆర్ అన్నారు. డెంగీతో 8 మంది మరణించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నట్లు సూచించారు. సమాచారాన్ని ఎవరు, ఎందుకు దాస్తున్నారు? అని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో తగిన ఔషధాలు లేవని ఆరోపించారు. చాలా దవాఖానాల్లో ఒక్కో బెడ్ పై ముగ్గురు, నలుగురు ఉంటున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమస్య తీవ్రతను గుర్తించాలని కేటీఆర్ కోరారు.