16 July, 2026 | 2:25 PM

ఎంఎల్ఎ కోవ లక్ష్మీపై కేసును తీవ్రంగా ఖండించిన కేటీఆర్

03-07-2024 07:00 PM

హైదరాబాద్ : ఆసిఫాబాద్ ఎంఎల్ఎ కోవ లక్ష్మీపై పెట్టిన కేసు నమోదు చేయటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త్రీవంగా ఖండించారు. ప్రజా పాలనంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టడమేన అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎంఎల్ఎలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని, స్థానిక ఎంఎల్ఎలకు ప్రోటోకాల్ ప్రకారం సరైన గౌరవం ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. గత కొంతకాలంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ప్రోటోకాల్ రగడ కొనసాగుతుంది.

కోమరభీం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎంఎల్ఎ కోవ లక్ష్మీ మధ్య ప్రోటోకాల్ రగడ తారాస్థాయికి చేరి వ్యక్తిగత ఘర్షణలకు దారి తీసింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు ఎంఎల్ఎ కోవ లక్ష్మీపై పోలీసులకు పిర్యాదు చేశాడు. విశ్వప్రసాద్ ఫిర్యాదుతో పోలీసులు లక్ష్మీపై 296(B), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.