జూలై 5 నుంచి సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా
03-07-2024 06:20 PM
హైదరాబాద్ : తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సాధారణ బదిలీలపై ఇప్పటివరకు నిషేధం కొనసాగుతుంది. ఆ నిషేధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
జూలై 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉద్యోగులను బదిలీల ప్రక్రియ కొనసాగుతుందని, రాష్ట్రవ్యాప్తంగా కౌన్సెలింగ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఉద్యోగుల సాధారణ బదిలీలపై అడ్డంకులు తొలగిపోయినందుకు అన్ని విభాగాల్లో సందడి నెలకొంది.






