calender_icon.png 20 July, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం ఇష్యూను పక్కదారి పట్టించేందుకే కవిత లేఖ నాటకం

26-05-2025 07:46:31 PM

కేసీఆర్ డైరెక్షన్లోనే ఫ్యామిలీ షో నడుస్తుంది..

సీఎం రేవంత్ ను విమర్శించే హక్కు కేటీఆర్ కు లేదు..

డిసిసి ఉపాధ్యక్షుడు సంగ స్వామి యాదవ్..

సిరిసిల్ల (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాజేసిన కేసీఆర్ కుటుంబ సభ్యులు దోషులుగా తేలి జైలుకు వెళ్లే సమయం ఆసన్నమవుతున్న తరుణంలో ఇష్యూను డైవర్ట్ చేసేందుకు, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS chief KCR) డైరెక్షన్లో ఫ్యామిలీ షో నడుస్తుందని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు సంగ స్వామి యాదవ్(District Vice President Sangaswami Yadav) ఆరోపించాడు. బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం స్వామి యాదవ్ పత్రిక ప్రకటన విడుదల చేశారు.

ఎమ్మెల్సీ కవిత లేఖ ఒక పెద్ద కట్టు కథ అని, రాష్ట్ర ప్రజలతో పాటు మీడియా దృష్టిని కాళేశ్వరం ఇష్యూ నుండి మళ్లించేందుకే కవిత లేఖ విషయం బయటకు వచ్చిందని ఇదంతా కేసీఆర్ డైరెక్షన్ లోనే నడుస్తుందని, ఈ ఇష్యూపై ఎవరు మాట్లాడవద్దనీ తాజాగా కేసీఆర్ పార్టీ శ్రేణులకు ఇచ్చిన సూచననే నిలువెత్తు సాక్ష్యమని అన్నాడు. వాస్తవానికి కేసీఆర్ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వారు చేసినా తప్పులను కప్పి పుచ్చుకోవడం కొరకు, ప్రజల్లో డ్యామేజ్ కాకుండా ఉండేందుకు లేఖ పేరుతో కొత్త నాటకానికి తెర లేపారనీ, రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందని, ఆరు గ్యారెంటీల అమలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, దీంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని, ఇది చూసి ఓర్వలేని ట్విట్టర్ టిల్లు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డాడు. సీఎం రేవంత్ రాజీనామా చేయాలని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందని, అసలు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మింగిన కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తం రాజకీయాలకు శాశ్వతంగా రాజీనామా చేయాలే తప్పితే ప్రజా నాయకుడు, అభివృద్ధి ప్రధాత సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయాలో చెప్పాలని కేటీఆర్ కు సవాలు విసిరాడు.

ఏది ఏమైనా,  ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా రాష్ట్రంలో బి.ఆర్.ఎస్ పార్టీకి ఇక స్థానం లేదని, రాష్ట్ర ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని, త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీపై గానీ, తమ నాయకులపై గానీ బి.ఆర్.ఎస్ నాయకులు అర్థంపర్థం లేని వ్యాఖ్యలు సహించేది లేదని ఘాటుగా హెచ్చరించాడు. మీరు చేసే తప్పుడు వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ కాంగ్రెస్ పార్టీ సైన్యం ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశాడు.