calender_icon.png 19 July, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదనపు కలెక్టర్‌గా నారాయణ అమిత్

26-05-2025 07:41:32 PM

ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..

నలగొండ టౌన్ (విజయక్రాంతి): మిర్యాలగూడ సబ్ కలెక్టర్, ఐఏఎస్ అధికారి నారాయణ అమిత్ కు స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. కాగా సెలవు నుండి తిరిగి వచ్చిన రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ సోమవారం రెవిన్యూ అదనపు కలెక్టర్‌గా విధులలో చేరారు.

ఇప్పటివరకు రెవెన్యూ అదనపు కలెక్టర్‌గా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న మిర్యాలగూడ సబ్ కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ లు ఇంచార్జి బాధ్యతల నుండి వైదొలగారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.