calender_icon.png 21 July, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తినుబండారాల తయారు కేంద్రంపై అధికారుల తనిఖీలు

26-05-2025 07:54:59 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): జమ్మికుంట ప్రముఖ వ్యాపార కేంద్రం నుండి సుమారు 6 మండలాలకు చిరు వ్యాపారం నిత్యం జరుగుతూనే ఉంటుంది. కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ నియోజకవర్గంలోని  జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లిలో గత 25 సంవత్సరాల నుండి చిరు కిరాణ షాపులలో దొరికే చిన్నపిల్లలు తినే లడ్డూలు, చేగోడీ, కారా, రసగుల్లా లాంటి మొదలైన తినుబండారాలు తయారు చేసే పాండు పరిశ్రమపై ఫిర్యాదు రాగా సోమవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్ రెడ్డి(District Food Safety Officer Ankit Reddy) తన బృందంతో ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన తయారీ కేంద్రంలో ఉన్న పలు రకాల పదార్థాలను పరిశీలించడంతో పాటు లైసెన్స్ ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ పరిశ్రమకు రిజిస్ట్రేషన్ ఉంది కానీ లైసెన్స్ లేదు. నాసిరకం పదార్థాలు వాడుతున్నారు అని, తినుబండారాలలో కలిపే రకరకాల రంగులను వాడుతున్నారని, వాడిన నూనె తిరిగి మళ్లీ వాడుతున్నారని దీనివలన ఆ పదార్థాలు తిన్నట్లయితే వ్యాధులు సంక్రమిస్తాయని అని తెలిపారు. తయారు చేసే కొన్ని పదార్థాలను తీసుకెళ్లి వాటిని పరీక్షించి అనంతరం పరిశ్రమ యజమానిపై చట్టపరమైన చర్య తీసుకుని సీజ్ చేస్తామని తెలిపారు.