10 May, 2026 | 10:17 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

కేటీఆర్‌కు పిచ్చి కుక్క కర్చినట్లుగా ఉంది

18-06-2025 12:00 AM

టూరిజం కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి 

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి) : మాజీ మంత్రి కేటీఆర్ తీరు చూస్తుంటే.. పిచ్చికుక్క కరిచినట్లుగా వ్యవహారిస్తున్నాడని, రాజ్యాంగ వ్యవస్థలను అవమానించేలా మాట్లాడుతున్నాడని  టూరిజం కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి విమర్శించారు. ఫార్ములా వన్ కేసులో తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌కు పదే పదే జైలు ఫోబియా పట్టుకుందన్నారు.

జైలుకు వెళ్లితే సీఎం అవుతాననే ఆలోచనతో పదే పదే జైలు ఆలోచన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ జైలుకు పోయినా..? కాలు పైకి తల కిందికి పెట్టి తపస్సు చేసిన సీఎం కావడం సాధ్యం కాదన్నారు. అధికారం మదంతో ఫోన్ ట్యాపింగ్ చేసి నిస్సిగ్గుగా వ్యవహారించారని మండపడ్డారు.

కేటీఆర్ లుచ్చా మాటలు బంద్ పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ తగిన గుణపాఠం చెబుతుందని రమేష్‌రెడ్డి హెచ్చరించారు. బీఆర్‌ఎస్ బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహారించాలన్నారు. ప్రజా  సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వంపై నోరుపారేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.