10 May, 2026 | 9:09 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

విద్యార్థి నాయకుడు ఆదిత్యపై హత్యాయత్నం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి

18-06-2025 12:00 AM

కొత్తపల్లి, జూన్ 17:ఏబీవీపీ కరీంనగర్ నగర శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కన్వీనర్ ఆదిత్య పైన దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేస్తూ స్థానిక తెలంగాణ చౌరస్తా వద్ద మంగళవారం రోజున నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాల్యాల రాకేశ్ మాట్లాడుతూనిత్యం విద్యారంగ సమస్యలపై దేశ సమస్యలపై సామాజిక సమస్యలపై పోరాటం చేసే ఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య పై రాజ్యాంగ వ్యతిరేక గూండాలు దాడి చేయడం బాధాకరమని, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య రాజ్యాంగ వ్యతిరేక శక్తుల చర్యలను ప్రశ్నించినందుకు ఆయన పైన పదునైన ఆయుధాలతో హత్యాయత్నం చేయడం దారుణమన్నారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పినందుకు ఆదిత్య పై హత్యాయత్నం చేయడాన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నమని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అన్నాడి శ్రీవర్ధన్,గోస్కుల విజ్ఞేష్ జోనల్ ఇంచార్జి లు యోగేష్,విష్ణు వంశీ మరియు విద్యార్థులుపాల్గొన్నారు.