10 May, 2026 | 11:37 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయ సమావేశం

18-06-2025 12:00 AM

కరీంనగర్ క్రైం, జూన్17(విజయక్రాంతి):కరీంనగర్ కమీషనరేట్ కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాలునందు మంగళవారం పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసు కమీషనర్ మాట్లాడుతూ, గత శనివారం నాడు జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో పోలీసు అధికారులతో సమన్వయం చేసి 3478 కేసులను పరిష్కరించినందుకు గాను పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అభినందించారు.

ఏదైనా కోర్టులో పెండింగ్ కేసులను పరిష్కరించుటకు పోలీసు అధికారుల సమన్వయ లోపం ఉన్నట్లయితే, తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో ఇదే విధంగా సహకరించుకుని కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని వారిని కోరారు. రానున్న అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశంలో భాగస్వామ్యులు కావాలని, పోలీసు అధికారులకు గల సందేహాలను నివృత్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, సీసీఆర్బి ఏసీపీ జి విజయ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ప్రాసిక్యూషన్ డి శరత్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె శ్రీరాములు, అడిషనల్ పీపీ లు ఏ రాములు, గౌరు రాజిరెడ్డి, పి కుమార స్వామి, కె జాన్సీ, ఏపీపీ లు గాయత్రి, జి వీరాస్వామి, ఏ రంజిత్ కుమార్, ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ లతో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బందిపాల్గొన్నారు.