22 July, 2026 | 5:25 PM

శ్రీ చైతన్యలో ఐబీఎం ఆధ్వర్యంలో 'ఏఐ టూల్స్ & అప్లికేషన్స్' వర్క్‌షాప్

22-07-2026 04:06 PM

ఖమ్మం ఎడ్యుకేషన్,(విజయక్రాంతి): స్థానిక పొన్నేకల్ లోని శ్రీ చైతన్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & రీసెర్చ్, ఖమ్మంలో కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఐబీమ్ స్కిల్సబిల్డ్ ప్రోగ్రాం సహకారంతో "ఏఐ టూల్స్ & అప్లికేషన్స్ " అంశంపై 4 రోజుల వర్క్‌షాప్. ఈ సందర్బంగా కళాశాల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (AI)లో వస్తున్న తాజా పరిణామాలు, పరిశ్రమల్లో AI వినియోగం, జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ ఆధారిత కెరీర్ అవకాశాలపై సమగ్ర అవగాహన కల్పించడం కోసం వర్కుషాప్ ఏర్పాటు చేశామని తెలిపారు. 

ఈ సందర్భంగా  రిసోర్స్ పర్సన్ ఐబిమ్ స్కిల్స్ తెలంగాణ హెడ్, రాఘవేంద్ర గుప్తా మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను అందిపుచ్చుకొని, AI వంటి ఆధునిక సాంకేతికతల్లో నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. కృత్రిమ మేధస్సు భవిష్యత్తు ప్రపంచాన్ని నిర్దేశించే సాంకేతికతగా రూపుదిద్దుకుంటోందని, విద్యార్థులు AI ఆధారిత నైపుణ్యాలను అలవర్చుకుని ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. 

IBM SkillsBuild వంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు విద్యార్థుల భవిష్యత్ కెరీర్‌కు బలమైన పునాది వేస్తున్నాయి. ఇటువంటి పరిశ్రమ ఆధారిత శిక్షణా కార్యక్రమాలను ఎంపిక చేసిన కళాశాలలో నిరంతరం నిర్వహిస్తాం అని తెలిపారు. కళాశాల డైరెక్టర్ శ్రీమతి శ్రీ విద్య మాట్లాడుతూ, నేటి ఉద్యోగ ప్రపంచంలో డిగ్రీతో పాటు నైపుణ్యాల పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ వర్క్‌షాప్ ద్వారా విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన ప్రాక్టికల్ నాలెడ్జ్‌ను పొందుతారు అని పేర్కొన్నారు. 

కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి సాయి గీతిక మాట్లాడుతూ, "విద్యార్థులు ఐబీమ్ స్కిల్సబిల్డ్ అందించే కోర్సులు, సర్టిఫికేషన్లు మరియు డిజిటల్ క్రెడెన్షియల్స్‌ను సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవాలి. భవిష్యత్తు సాంకేతిక ప్రపంచానికి సిద్ధమయ్యేలా శ్రీ చైతన్య ఎల్లప్పుడూ ఉత్తమ అవకాశాలను కల్పిస్తూనే ఉంటుందన్నారు. కలశాల ప్రిన్సిపాల్ డా. జె. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... విద్యార్థులు ఈ వర్క్‌షాప్‌లో అందించే ప్రతి అంశాన్ని శ్రద్ధగా అభ్యసించి, AI సాంకేతికతను విద్య, పరిశోధన మరియు ఆవిష్కరణలలో సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. 

కళాశాల డీన్ డాక్టర్ వి సుదర్శన్ మాట్లాడుతూ... విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సృజనాత్మకత, సమస్య పరిష్కార సామర్థ్యం, ఆవిష్కరణాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు చేరవేయడానికి సంస్థ నిరంతరం వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వైశాలి, కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, డిప్లొమా ఇంచార్జి కృష్ణ ప్రసాద్ మరియు వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపక మరియు అధ్యపాకె తర సిబ్బంది పాల్గొన్నారు.