కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి
08-05-2026 12:00 AM
పీసీసీ అధికార ప్రతినిధి రవిచంద్ర
హైదరాబాద్, మే 7(విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పీసీసీ అధికార ప్రతినిధి మేడి రవిచంద్ర డిమాండ్ చేశారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్, ఎన్నికల్లో ఇచ్చిన హామీలెన్ని నేరవేర్చారో చెప్పాలన్నారు. గురువారం ఆయ న గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. దేశంకోసం ప్రాణాల ర్పించిన గాంధీ కుటుంబంపైన ఇలాంటి మాటలు మాట్లాడడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు.






