8 May, 2026 | 1:03 AM

బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు

08-05-2026 12:00 AM

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

ఘట్ కేసర్, మే 7 (విజయక్రాంతి): ఘట్ కేసర్ పట్టణ కేంద్రంలో నిలిచిపోయిన రైల్వే వంతెన నిర్మాణ పనులు పూర్తి చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 3కోట్ల, 87లక్షల, 54 వేలు నిధులు మంజూరు చేయడంతో గురువారం ఘట్ కేసర్ పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇంచార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు ఘట్కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్  ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

అనంతరం టపాకాయలు కాల్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఎస్సీ సెల్ చైర్మన్ నగరిగారి ప్రీతం హాజరయ్యారు. ఈసందర్బంగా మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్యయాదవ్  మాట్లాడుతూ ఘట్కేసర్ రైల్వే వంతెన నిర్మాణంలో జరుగుతున్న జ్యాప్యం, అదేవిధంగా సంబంధిత కాంట్రాక్టర్ కు రావాల్సిన నిధుల కోసం డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు ని కోరిన వెంటనే ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించినందుకు వారికి అలాగే మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

గత 17 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న నిర్మాణ వంతెన పనుల వల్ల ఘట్కేసర్ అదేవిధంగా చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురుకున్నారని, వారి ఓపికకి అలాగే పోరాటంలో భాగస్వాములైన జేఏసీ, యువత, ప్రజలకు ఈసందర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమం మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్, మున్సిపల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒక్క సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ డక్కి రమేష్, కీసరగుట్ట ఆలయ డైరెక్టర్ సగ్గు అనీత, సామల అమర్, కొమురవెల్లి ఆలయ ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, మాజీ డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు యాదవ్, జేఏసీ నాయకులు ప్రమోద్, ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఫరూక్, ఉప్యాధ్యక్షులు కె. నాగరాజు, బొక్క ప్రభాకర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు వి.బి. వెంకటనారాయణ, సీనియర్ నాయకులు బొక్క సత్తిరెడ్డి, ఖయ్యూం, ఫాయుమ్, కడపోల్ల రాజు, సుధాకర్, సాయియాదవ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.