ఎన్నో త్యాగాలకు సిద్ధపడి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు
ముత్తారంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం..
ముత్తారం (విజయక్రాంతి): ఎన్నో త్యాగాలకు సిద్ధపడి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ప్రకటించారని ముత్తారంలో సోనియాగాంధీ జన్మదిన వేడుకల్లో మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం అన్నారు. ఏఐసీసీ అగ్ర నాయకురాలు, తెలంగాణ ప్రదాత సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలను సోమవారం ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ.. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని, ఎన్నో త్యాగాలకు సిద్ధపడి సోనియాగాంధీ తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సహకారం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు బక్కతట్ల వినీత్ యాదవ్, నాయకులు మద్దెల రాజయ్య, వాజిద్ పాషా, తాటిపాముల శంకర్, రాపెల్లి రామన్న, గోపాల్ రావు, గాదం శ్రీనివాస్, దుండె రాజేందర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






