calender_icon.png 14 January, 2026 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం

14-01-2026 01:52:13 AM

న్యూయార్క్‌లోని కొలంబియా బిజినెస్ స్కూల్‌లో ఏప్రిల్ ౪న ప్రసంగించనున్న మాజీ మంత్రి

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు అంతర్జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం లభించింది. మంత్రిగా ఆయన హయాంలో చేసిన అసాధారణ కృషి, తెలంగాణను ప్రప ంచ పటంలో విశిష్టంగా నిలిపిన విధానాలను గుర్తిస్తూ, అంతర్జాతీయ వేదికపై తన ఆలోచనలను పంచుకోవాలంటూ ఆయనకు ఈ ఆహ్వానం అందింది.

ఈ నేపథ్యంలో, అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న కొలంబియా బిజినెస్ స్కూల్ లో 2026 ఏప్రిల్4న జరగనున్న ‘21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్’లో ప్రసంగించేందుకు కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఈ సదస్సును కొలంబియా యూ నివర్సిటీకి చెందిన విద్యార్థి విభాగం ‘సౌత్ ఆసియా బిజినెస్ అసోసియేషన్ ’ నిర్వహిస్తోంది.

భారతదేశ వ్యాపారం, ఆవిష్కరణ లు, విధాన నిర్ణయ రంగాలపై మేధోమథనం జరిగే ప్రపంచంలోని అత్యంత ప్రతి ష్టాత్మక వేదికలలో ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ ఒకటిగా గుర్తింపు పొందింది. గత 21 ఏళ్లుగా న్యూయార్క్‌లో జరుగుతున్న ఈ సదస్సు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం పోషిస్తున్న పాత్రపై చర్చించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రవాస భారతీయులకు ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తోంది.