13 July, 2026 | 9:54 PM

Breaking News

తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •  

రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావ్

07-10-2024 06:15 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సామాన్యులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపి భయాన్ని సృష్టించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్ ను కాపాడుకోవటం చేతగాక, సామాన్యలపైకి బుల్డోజర్లను పంపారన్నారు. తీరా చూస్తే రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందని కేటీఆర్ తెలిపారు. హైడ్రా హైరానాతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పడిపోయిందని, 2 నెలల్లో రిజిస్ట్రేషన్లు పడిపోయాయి.. ఆదాయం తగ్గిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కొత్త ఆదాయం సృష్టించకున్నా పర్వాలేదు.. ఉన్నది ఊడగొడుతున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ప‌నిచేస్తున్నావో అర్థ‌మైతుందా? మీ ఫోర్ బ్ర‌ద‌ర్ సిటీపై ఫోక‌స్ చేసి, అక్క‌డ కృత్రిమ రియ‌ల్ బూమ్ కోసం ఆలోచిస్తున్న‌ట్లు అన్నారు. సామాన్యులు కొనుగోలు, అమ్మ‌కం లేనిది బూమ్ ఎట్లా వ‌స్త‌ది?  ఆదాయం ఎట్లా పెరుగుత‌దని కేటీఆర్ వెల్లడించారు.