14 July, 2026 | 2:19 AM

కోల్‌కతా హత్యాచారం కేసు.. సీబీఐ చార్జిషీట్

07-10-2024 04:59 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): కోల్ కతా ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో అరెస్టయిన ప్రధాని నిందితుడు సంజయ్ రావ్ పై సీబీఐ సోమవారం చార్జిషీట్ నమోదు చేసింది. వైద్యురాలిపై ప్రధాన నిందితుడు సంజయ్ ఆగస్టు 9వ తేదీన హత్యాచారం చేసినట్లు సీబీఐ అధికారులు అభియోగపత్రం విడుదల చేశారు. ఈ హత్యాచారం కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ వెల్లడించింది.