calender_icon.png 6 December, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపద కొందరి చేతుల్లోనే ఉంటే ఇట్లనే ఐతది

06-12-2025 02:52:42 PM

విమానాశ్రయాలు కూడా బస్టాండ్ల మాదిరే

హైదరాబాద్: విమానాశ్రయాల్లో పరిస్థితి దారుణంగా తయారైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. తెలంగాణ భవన్ లో ట్రేడ్ యూనియన్ ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. పైలట్లను శ్రమ దోపిడీ చేయవద్దని ఏడాది క్రితమే కేంద్రం చెప్పంది. కేంద్రం చెప్పినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకే ఇప్పుడు ఇండిగో సమస్య వచ్చిందని సూచించారు. విమానాశ్రయాలు కూడా బస్టాండ్లు మాదిరి తయారయ్యాయని పేర్కొన్నారు. ఇండిగో వెనక్కి తగ్గలేదు.. కేంద్రమే తన ఆదేశాలు వెనక్కి తీసుకుందని కేటీఆర్ వెల్లడించారు. సంపద మొత్తం కొంతమంది చేతుల్లో ఉంటే ఇలాగే అవుతుందని స్పష్టం చేశారు. దేశంలోని విమానాలన్నీ టాటా, ఇండిగో చేతుల్లోనే ఉన్నాయని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండాలి.. అది కూడా నాణ్యతతో ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు.