calender_icon.png 6 December, 2025 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల...

06-12-2025 02:53:59 PM

బాన్సువాడ,(విజయ క్రాంతి): రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బిఆర్ అంబేడ్కర్ 69వ వర్ధంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని డా. బి ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్  కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి లు పూలమాలవేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన బాటలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, డా. బి ఆర్ అంబేడ్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.