calender_icon.png 6 December, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాట్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి .. అభివృద్ధి చేసి చూపిస్తా..

06-12-2025 02:48:46 PM

కందనెల్లి తండా సర్పంచ్ అభ్యర్థి శాంత దేవి

తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలంలో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం జోరు అందుకుంది. మండల పరిధిలోని కందనెల్లి తాండ టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రమావత్ శాంత దేవి తండాలో నేడు గ్రామస్తులు, యువకులు, మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంట్లో ఆడపడుచులకు బొట్టు పెట్టి బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సర్పంచ్ గా గెలిచిన తర్వాత గ్రామంలో పేద ఆడపడుచుల వివాహానికి పదివేల రూపాయలు  అందిస్తామని.. పేద కుటుంబంలో ఎవరైనా మృతి చెందితే రూ 5 వేల రూపాయలు ఇస్తామని వారు విడుదల చేసిన మేనిఫెస్టోలో పేర్కొన్నారు.