30 May, 2026 | 3:32 PM

కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసింది: కేటీఆర్

30-05-2026 02:49 PM

కేసీఆర్ పాలనలోనే అధికారులకు స్వేచ్ఛ

హైదరాబాద్: కేసీఆర్ పాలనలో(KCR's Administration) అధికారులకు స్వేచ్ఛ ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తెలిపారు. తెలంగాణలో గురుకుల పాఠశాలలను అభివృద్ధి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ అన్ని వార్గాలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇందిరా పార్క్‌(Indira Park) వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ధర్నా కార్యక్రమంలో KTR పాల్గొన్నారు. ఇంకో సంవత్సరం కష్టపడితే ప్రజలను సతాయించే కాంగ్రెస్, బీజేపీ నేతలకు మిత్తితో సహా చెల్లించే బాధ్యత తనదని కేటీఆర్ స్పష్టం చేశారు.