18 July, 2026 | 4:43 PM

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

18-07-2026 04:43 PM

నిర్మల్,(విజయక్రాంతి): సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంలా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు అన్నారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.11 లక్షల 80 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూనే, పేదలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సకాలంలో ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏం సి చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, అబ్దుల్ హాది  డీసీసీ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు గాజుల రవికుమార్,  వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాథోడ్ సంతోష్, నరేష్ రెడ్డి, మొహిముద్దీన్ తదితరులు పాల్గొన్నారు.