18 July, 2026 | 4:33 PM

నీటి పంపులను ప్రారంభించిన ఎమ్మెల్యే

18-07-2026 04:33 PM

కుబీర్,(విజయక్రాంతి): బాసర , బిదిరెల్లి గ్రామాలకు తాగునీరు అందించే బాసర లిఫ్ట్ ఇరిగేషన్ పంపు నీటిని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ శనివారం విడుదల చేశారు. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులు నేపథ్యంలో నాయకత్వ రైతులు గోదావరిలో కాలువ తీసి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులకు నీళ్లు మళ్లించారు. పంపుల మరమ్మత్తుల అనంతరం సాగునీటి కోసం నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సాయినాథ్ పటేల్ నాయకులు సతీష్ రావు తదితరులు ఉన్నారు.