24-11-2025 01:12:55 AM
-రేపు చెన్ను సదస్సులో దక్షిణ భారతదేశ భవిష్యత్తుపై కీలక ప్రసంగం
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025’ లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ సదస్సు మంగళవారం చెన్నులోని ఐటీసీ గ్రాండ్ చోళాలో జరగనుంది.
ఈ సందర్భం గా వేదికపై జరిగే చర్చా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని, దక్షిణ భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాంకేతిక పరిణామాలపై తను అభిప్రా యాలను పంచుకోనున్నారు. ‘సదరన్ రైజిం గ్ సమ్మిట్’ మూడో ఎడిషన్ ఈ సారి ‘భవిష్యత్తుకు సిద్ధం: ఆవిష్కరణ, పరివర్తన, స్ఫూర్తి’ అనే ఇతివృత్తంతో జరగనుంది.
ఆర్థిక వృద్ధి, ఆరోగ్యం, విద్య, మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలలో దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయో అనే అంశంపై చర్చించడానికి ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమలు, పౌర సమాజానికి చెం దిన ప్రముఖులను ఈ సదస్సు ఒకే వేదికపైకి తీసుకురానుంది.
ఏబీపీ నెట్‌వర్క్ తమ ఆహ్వానంలో కేటీఆర్ వంటి నాయకులు పాల్గొనడం కేవలం తెలంగాణకే కాకుండా, యావత్ భారతదేశానికి దిశను నిర్దేశించడంలో దోహదపడుతుందని సంస్థ పేర్కొం ది.
ఈ కార్యక్రమంలో కేటీఆర్ తెలంగాణ సాధించిన ప్రగతి, భారతదేశ వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, తయారీ, ఐటీ, ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్, ఆవిష్కరణల ఆధారిత రంగాలలో వస్తున్న కొత్త అవకాశాలపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు.