calender_icon.png 24 November, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెట్ నుంచి మినహాయించండి

24-11-2025 01:11:23 AM

-ఇన్‌సర్వీస్ టీచర్ల సమస్యపై తపస్ ఆధ్వర్యంలో ఎంపీలకు వినతులు

-40వేల టీచర్ల కొలువులు ప్రశ్నార్థకంలో ఉన్నాయని వెల్లడి

-పార్లమెంట్ సమావేశాల్లో చట్ట సవరణ చేయించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): ఇన్ సర్వీస్ టీచర్లను టెట్ (ఉపా ధ్యాయ అర్హత పరీక్ష) నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపా ధ్యాయ సంఘం (తపస్) వినూత్న కార్యక్రమాన్ని చేపడుతోంది.

డిసెంబర్‌లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో టెట్ మినహాయింపుపై కేంద్రం నిర్ణయం తీసుకునేలా దేశ వ్యాప్తంగా పార్లమెంట్ సభ్యులందరికీ వినతిపత్రాలు సమర్పించాలని అఖిల భారతీ య రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఘ్ (ఏబీఆర్‌ఎస్‌ఎం) నిర్ణయించినట్లుగా తపస్ రాష్ట్ర అధ్య క్ష, ప్రధానకార్యదర్శులు హన్మంత్‌రావు, న వాత్ సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

పార్లమెంట్ సమావేశాల్లో చర్చించి టెట్ నుండి టీచర్లకు మినహాయింపునిస్తూ విద్యాహక్కు చట్ట సవరణ చేయాలని దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలకు తమ సమస్యను వివరించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఏబీఆర్‌ఎస్ ఎం ఆధ్వర్యంలో ఆయా రాష్ట్రాల్లోని అనుబంధ టీచర్ సంఘాలు ఇందులో పాల్గొం టున్నాయని తెలిపారు.

ఈ క్రమంలోనే తెలంగాణలోనూ ఈనెల 28 వరకు రాష్ట్రంలోని ప్రతి ఎంపీకు వినతి పత్రాలు ఇవ్వ నున్నట్లు వారు పేర్కొన్నారు. ఏ జిల్లాల్లోని ఆ జిల్లా ఎంపీలకు అక్కడి తపస్ జిల్లా బా ధ్యులు వినతిపత్రాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ ఎంపీ రఘునం దన్ రావుకు సిద్ధిపేట శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. 

23.08.2023 కన్న ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఉందని ఎన్‌సీటీఈ నిబంధన ఇప్పటికే ఉందని, కానీ ఓ కేసులో టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి ఉండాలని సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడంతో టీచర్లందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.

ఒక రాష్ట్రంలోనే 40 వేలకుపైగా టీచర్ల కొలువులు ప్రశ్నార్థకంలో ఉన్నాయని, ఈక్రమంలోనే పార్లమెంట్ స మావేశాల్లో టెట్ అర్హతపై చర్చించి టీచర్లకు మినహాయింపునివ్వాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.