calender_icon.png 4 December, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డి అవినీతి అనకొండ

04-12-2025 12:03:09 PM

హైదరాబాద్: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (Hyderabad Industrial Land Transformation Policy) పేరిట రూ. 5 లక్షల కోట్ల పారిశ్రామిక భూముల కుంభకోణానికి పాల్పడుతున్న కాంగ్రెస్ సర్కార్(Congress government) కుట్రను ఎండగట్టేందుకు కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పర్యటించారు. అక్కడ కార్మికులతో చర్చ పెట్టి వారికి కాంగ్రెస్ భారీ భూ కుంభకోణాన్ని వివరించారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు. భూములను చౌకధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని కేటీఆర్ అన్నారు.

పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై బీఆర్ఎస్ బృందం నిజనిర్ధారణ చేస్తోంది. భూముల దోపిడీ ఆర్నెళ్లుగా జరుగుతోందన్న కేటీఆర్ ఇప్పుడు పాలసీ బయటకొచ్చిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ సర్కార్ రూ. 5 లక్షల కోట్ల భూ దోపిడీకి పాల్పడుతుందని తెలిపారు. ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలని కేటీఆర్ తేల్చిచెప్పారు.  రూ. 5 లక్షల కోట్ల భూకుంభకోణంపై క్షేత్రస్థాయిలో పోరాడతామని హామీ ఇచ్చారు. ఆషాఢం సేల్ వంటి ఆఫర్ ను చూసి పారిశ్రామికవేత్తలు మోసపోవద్దని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో పారిశ్రామికవేత్తలు భాగం కావొద్దని హితువుపలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ భూములు వెనక్కి తీసుకుంటామని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అవినీతి అనకొండ.. ఢిల్లీకి మూటలు పంపేందుకు.. దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం భూములను ధారాదత్తం చేస్తున్నారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.