14-11-2025 10:51:06 PM
కాకతీయ విశ్వవిద్యాలయం,(విజయక్రాంతి): ఈరోజు ఉదయం కేయూ ఫస్ట్ గేట్ నుండి గోపాలపురం క్రాస్ రోడ్ వరకు మేఘన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు నిర్వహించిన వరల్డ్ డయాబెటిక్స్ అవేర్నెస్ ప్రోగ్రాంకి ముఖ్యఅతిథిగా హాజరైన కేయూ వైస్ ఛాన్స్లర్ కే ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజలకు డయాబెటిస్ పైన అవగాహన కల్పిస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఇచ్చిన నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలి. భారతదేశంలో 100 మిలియన్లకు పైగా డయాబెటిస్ రోగులు ఉన్నారు.
ఈ వ్యాధికి సంబంధించిన అతిపెద్ద ఆందోళన ఏమిటంటే చాలా మందికి దాని లక్షణాల గురించి తెలియదు. చాలా సందర్భాలలో, ఈ లక్షణాలు చాలా ఆలస్యంగా గుర్తించబడతాయి.. ఆ సమయానికి వ్యాధి తీవ్రత మరింత పెరుగుతుంది. అసలు డయాబెటిస్ ఎందుకు వస్తుంది? ఎన్ని రకాలు ఉన్నాయి? దీని వల్ల ఏ వయస్సు వారు ప్రభావితమవుతారు? దాని ప్రారంభ లక్షణాలు ఏమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు అవగాహనతో ఉండటం మంచిది.
ఈ కార్యక్రమంలో కేయూ రిజిస్టర్ వి.రామచంద్రం గారు ఫార్మసీ విభాగం సమయ గారు మరియు వాగ్దేవి కాలేజ్, నేతాజీ ఫార్మసి, తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొని వరల్డ్ డయాబెటిక్ డేను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో అందరి కలుపుకొని ఆర్గనైజ్ చేసిన మేఘనా మల్టీస్పెషల్టి హాస్పిటల్ డాక్టర్ మేఘన గారిని అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు వాక్ అవేర్నెస్ వంటి ప్రోగ్రాంలో మా యూనివర్సిటీ ఎప్పటికీ విద్యార్థులను ప్రోత్సాహిస్తుంది.