19 August, 2026 | 3:12 PM

Breaking News

ఓడ్ల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు   •   పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను SBTET పరిధిలోనే కొనసాగించాలినీ విద్యార్థుల ధర్నా   •   సీఎం రేవంత్‌, పొంగులేటిపై హరీష్‌ రావు సంచలన వ్యాఖ్యలు   •   మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం ఖాళీ బిందెలతో నిరసన   •   బాల్య వివాహాలు లేని గ్రామంగా అంకుసాపూర్   •   మాజీ ఎమ్మెల్యే కిశోర్ జర్నలిస్టు వీరమల్లును పరామర్శ.   •   అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం   •   స్కూటీ డిక్కీలో గంజాయి.. పోలీసులకు చిక్కిన నిందితుడు   •   ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత   •   హెచ్‌సీఏ వన్డే టోర్నీకి చాణిక్య ఎంపిక   •  

‘కుడా’ ప్రభుత్వ స్థలాల వేలాన్ని రీకాల్ చేయాలి

27-06-2026 02:03 AM

-మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్

హనుమకొండ, జూన్ 26 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆదాయం కోసం కుడా ప్రభుత్వ స్థలాలను వేలం వేసి అవినీతికి తెరలేపారని, వెంటనే వేలాన్ని రీ కాల్ చేయా లని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాలసముద్రం బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ పాడిందే పాడు,పాసుపళ్ల దాసు అన్న తీరుగా రెండున్నరేళ్లుగా ఏది జరిగినా గత ప్రభుత్వంపై ఆ రోపణలు చేస్తు,కాంగ్రెస్ నాయకులు కాలం వెళ్లదీస్తున్నారని, అడ్డిమార్ గుడ్డి దెబ్బలో గెలిచిన వ్యక్తి కొడతా, పొడుస్తా, తీస్తా అంటు పొడుగు పొడుగు మాటలు మాట్లాడుతున్నాడనీ, ప్రస్తుత ఎమ్మెల్యేని విమర్శించా రు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన కనీస లక్షణాలు లేకుండా చిల్లర మాటలు మాట్లాడు తున్నారని ఎద్దేవా చేశారు.

420 హామీలు, 6 గ్యారంటీ లు హామీ అమలు చేయడం మరిచి, కుడా ప్రభుత్వ స్థలాలను వేలం పేరిట అవినీతికి తెరలేపారని విమర్శించారు.అవినీతి కి సహకరించాలని అధికారులపై ఒత్తిడి తేస్తున్నారన్నారు. ప్రపంచం అంతా ఆన్లైన్ చేస్తుంటే కుడా వేలం ఆఫ్ లైన్ జరిగిందని,కుడా ప్లాట్ల వేలంలో భారీగా అవినీతి జరిగిందని,కుడా వేలాన్ని వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలపై కేసులు, దాడులు, కూల్చివేతలు, బెది రింపులు కాకుండా మిగిలిన రెండున్నరేళ్ళ లో అభివృద్ధి పై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

వాల్టా యాక్ట్‌కు తూట్లు పొడుస్తు, వైల్ లైఫ్ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ ను వి స్మరించి, యాదవ్ నగర్ - రెడ్డిపురం మార్గం లో ఉన్న చెరువును చట్టాలకు విరుద్ధంగా కూడిపివేస్తున్నారని, ఆ చెరువు పూడికత కారణంగా అక్కడ ఉన్న పక్షులు, జీవులు, జలచెరాల మనుగడ ప్రశ్నర్ధకం అయ్యిందన్నారు. పేదల ఇండ్లు కూల్చివేతలు కాదు, ని రుపేదలకు పట్టాలు ఇవ్వండన్నారు. స్థానికంగా ఉండే పేదలకు, అర్హులకు పంపిణీ చేయకుండా.. పేదల ఇల్లు కూల్చుతున్నార న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరాజుద్దీన్, మైనార్టీ కమిషన్ మా జీ సభ్యులు దర్శన్ సింగ్, మాజీ కార్పొరేటర్లు సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, జోరిక రమేష్ తదితరులు పాల్గొన్నారు.