27 June, 2026 | 3:34 AM

వైభవంగా బొడ్రాయి, ముత్యాలమ్మతల్లి పునప్రతిష్ఠ

27-06-2026 02:04 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

కొత్తగూడెం /లక్ష్మీదేవిపల్లి,  జూన్ 26  (విజయక్రాంతి): మన ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను, ఆచారాలను ప్రతిఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని,సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం, అనిశెట్టిపల్లి గ్రామంలో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించిన బొడ్రాయి, ముత్యాలమ్మతల్లి పునప్రతిష్ఠ మహోత్సవానికి, ముఖ్య అతిథిగా హాజరై, ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇటువంటి శుభకార్యాలు భక్తిభావంతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తాయని, భవిష్యత్ తరాలకు మన మూలాలను అందిస్తాయన్నారు. ఇంతటి మహత్తరమైన పునప్రతిష్ఠ కార్యక్రమాన్ని గ్రామస్థులు ఐక్యతతో విజయవంతం చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు.

ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన  అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అన్నదానం వంటి సత్కార్యాలు సమాజంలో సేవాభావాన్ని, మానవత్వాన్ని చాటుతూ ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని  పేర్కొన్నారు.   గ్రామ పెద్దలు వెంకట నర్సయ్య, రమణయ్య, వీరబాబు, నాగేశ్వర్రావు, వెంకటేశ్వర్లు, సతీష్, శ్రీనివాసరావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.