పెళ్లి పీటలెక్కనున్న కుల్దీప్ యాదవ్
కాన్పూర్, మార్చి 10 : భారత స్పిన్నర్ కుల్దీ ప్ యాదవ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వనిష్క ను పెళ్లి చేసుకోబోతున్నాడు. వీరి వివాహం మార్చి 14న ఉత్తరాఖండ్ ముసోరిలోని ఒక రిసార్ట్ వేదికగా జరగనుంది. గత ఏడాది జూన్ 4న వీరి నిశ్చితార్థం జరిగింది. నవంబర్‌లోనే పెళ్లి జరగాల్సి ఉండగా కుల్దీప్ టీ20 ప్రపంచకప్‌కు ఎంపికవడంతో వాయిదా పడింది.
ఇప్పటికే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న కుల్దీప్‌కు ఈ మెగాటోర్నీలో ఎక్కువ అవకాశాలు రాలేదు. కేవలం పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు. మార్చి 13న ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, తర్వాతి రోజు వివాహం వీరి కుటుంబసభ్యులు, సన్నిహితు ల సమక్షంలో జరగనుంది. 17న లక్నోలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు భారత క్రికెటర్లు, బీసీసీఐ సభ్యులతో పాటు ప్రముఖులు హాజరుకానున్నారు.




